Home

»

Latest News

ఇప్పటికి జ్ఞానోదయమైందా..?

Oct 5, 2016 5:34PM

కొందరికి అందం ఉంటే..అభినయం ఉండదు, మరికొందరికి అభినయం ఉంటే అందం ఉండదు. కాని ఈ రెండు ఉన్న అతికొద్ది మంది నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు. కేవలం ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే సీన్ పండించగల టాలెంటేడ్ హీరోయిన్. ముద్దు ముద్దు మాటలు, వినేకొద్ది వినాలనిపించే డైలాగ్ డెలివరీ...దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే నేటీ తరం హీరోయిన్లకు పూర్తి భిన్నం. కథలో..తను చేసే పాత్రలో బలముందని నమ్మితేనే ఒక సినిమాకు కమిట్ అవుతుంది నిత్యామీనన్.

ఇదంతా బాగానే ఉంది కాని ఈ మధ్య కాలంలో నిత్య కాస్త వోళ్లు చేసి, మరీ బొద్దుగా కనిపిస్తోంది. రీసెంట్‌గా రిలీజైన జనతా గ్యారేజ్‌లో అది కొట్టొచ్చినట్లు కనిపించింది. దీంతో కట్టుబాట్లను పక్కనబెట్టి తన వొంటిపై దృష్టి పెట్టిందట . అదొక్కటే కాకుండా ప్రస్తుతం వెంకటేష్-కిషోర్ తిరుమల కాంభినేషన్‌లో రానున్న "ఆడాళ్లూ..మీకు జోహార్లు"లో నిత్య హీరోయిన్‌గా కన్ఫార్మ్ అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రను దృష్టిలో పెట్టుకుని బరువు తగ్గాలని సూచించారట దర్శకనిర్మాతలు. దీంతో రంగంలోకి దిగిన నిత్య జిమ్‌లో చెమటలు చిందిస్తోందని సమాచారం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com