పాష్ పోరీస్ టీజర్
on Oct 5, 2016
మీకు డైలీ సీరియల్స్ అంటే చిరాకా? రెగ్యులర్ టాలీవుడ్ మసాలా సినిమాలంటే పరాకా? థియేటర్స్ కి వెళ్లటం దండగ, టీవీ ముందు కూర్చోటం అంతకంటే దండగా అనిపిస్తోందా? అయితే, వెంటనే మీరు మీ స్మార్ట్ ఫోన్ తీసుకోండి! లేదంటే ల్యాప్ టాపో, డెస్క్ టాపో అన్ చేసేయండి! తరువాత? తరువాతేముంది ఆల్రెడీ ఇంటర్నెట్ లో వాల్డ్ వైడ్ గా తెలుగు వార్ని అలరిస్తోన్న పోష్ పోరీస్ టీజర్ చూడండి!
టీజర్ అంటే... టీజ్ చేసేది కదా? దెన్ దిస్ వన్ ఈజ్ ది రియల్ టీజర్! మిమ్మల్ని ముగ్గురు అందమైన అమ్మాయిలు యమా టీజ్ చేస్తారు! సెంట్ పర్సెంట్ దే ఆర్ టుడేస్ బడ్డీస్! వాళ్ల ముగ్గురివి వేరు వేరు ప్రొఫెషన్స్. కాని, ఒకటే ఫ్లాట్! ముగ్గురివి వేరు వేరు ప్రాబ్లమ్స్. కాని, ఒకటే ప్లాట్! ఒకే కథలా నడిచే ముగ్గురు అమ్మాయిల జీవితాల్లోని మూడు కథనాల సమాహారం పాష్ పోరీస్. ఇంతకీ మ్యాటరేంటి అంటారా? టీజర్ చూస్తే కథ మొత్తం అర్థమైపోదు! కాని, తెలుగువన్ అందిస్తోన్న బ్రాండ్ న్యూ వెబ్ సిరీస్ పాష్ పోరీస్ టీజర్ చూస్తే మాత్రం , మీకు ఖచ్చితంగా, ఓ రిఫ్రెష్డ్ ఫీలింగ్ కలుగుతుంది! త్వరలో మెస్మరైజ్ చేయనున్న ట్రైలర్ అండ్ వెబ్ ఎపిసోడ్స్ కోసం మనస్సు ఉవ్విళ్లూరుతుంది! ఇట్స్ షూర్...