రష్మికా.. నేను నిన్ను భరిస్తా.. నువ్వు నన్ను భరించు!
on Feb 18, 2020

'భీష్మ' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో హీరో నితిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. "రష్మికా.. నేను నిన్ను భరిస్తా.. నువ్వు నన్ను భరించు. మనిద్దరినీ నా కాబోయే పెళ్లాం భరించాలి" అని వ్యాఖ్యానించాడు నితిన్. ఒక ఫ్రెండుగానే అతను ఈ మాటలు చెప్పినప్పటికీ నితిన్ ఇలా మాట్లాడేమిటి? అనే వ్యాఖ్యలు ఫిలింనగర్ నుంచి వినిపిస్తున్నాయి. నితిన్ ఆ మాటలు ఏ టోన్‌లో అన్నాడో చూస్తే.. క్లారిటీ వచ్చేస్తుంది.
సోమవారం రాత్రి జరిగిన 'భీష్మ' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన నితిన్, "నా అందానికి టిప్స్ బ్రహ్మాజీ గారిస్తే, రష్మిక ఇంత అందంగా, ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం.. తను తీసుకొనే ఆహారం. ఏం తింటుందో నాకు తెలీదు. ఆ ఫుడ్‌లో ఒక స్పెషల్ ఉంది. దాన్ని మీరెవరూ ట్రై చెయ్యకండి. దానికి సంబంధించిన అన్ని కాపీరైట్స్ తనదగ్గరే ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంచితే, 'భీష్మ'లో రష్మిక అమేజింగ్‌గా నటించింది. నటిగా తనకు ఇప్పటికే చాలా మంచి పేరుంది. అవార్డులు కూడా వచ్చాయి. చాలా పైకి ఎదిగింది. చివరి పాట 'వాటే బ్యూటీ'లో తను చేసిన డాన్స్ చూసి షాకయ్యా. చాలా చాలా బాగా చేసింది. తను చెయ్యకుంటే ఆ సాంగ్‌కు అంత పేరు వచ్చుండేది కాదు. నీ హార్డ్‌వర్క్, నీ డెడికేషన్ ఇలాగే ఉంటే చాలా పెద్ద స్టేజికి వెళ్తావ్. నువ్వు నాకు ఫ్రెండువి. నేను నిన్ను భరిస్తా.. నువ్వు నన్ను భరించు. మనిద్దరినీ నా కాబోయే పెళ్లాం భరించాలి" అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు నితిన్.
చాలా స్వచ్ఛంగానే ఒక స్నేహితుడిలా నితిన్ ఆ మాటలు చెప్పాడు. కానీ అతనన్న ఆ మాటల వరకే విడిగా చూస్తే.. మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అదే ఫిలింనగర్ వాసుల్లోనూ కనిపిస్తోంది. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



