ఆ దర్శకుడిపై హీరోకి నమ్మకం విపరీతంగా పెరిగిపోయింది!
on Dec 30, 2022

కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత 'స్వామి రారా', 'కార్తికేయ' వంటి భారీ హిట్స్ సొంతం చేసుకున్న యంగ్ హీరో నిఖిల్. ఇతను ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది 'కార్తికేయ 2' సినిమాతో వచ్చి అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో మంచి వసూళ్లను సాధించింది. హిందీలో అయితే ఈ చిత్రం ఎవరు ఊహించని సక్సెస్‌ను సొంతం చేసుకుంది. వసూళ్లు కూడా అదే స్థాయిలో రాబట్టింది. కాస్త శ్రద్ధ పెడితే 'కార్తికేయ'ను సీక్వెల్స్‌గా పాన్ ఇండియా రేంజ్ లో బాగా తీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నిఖిల్ ఆలోచనలు కూడా అదే దిశగా సాగుతున్నట్టు సమాచారం.
'కార్తికేయ 2' కంటే ముందుగా షూటింగ్ ప్రారంభించి, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ రచయితగా, సూర్య ప్రతాప్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ నిర్మించిన '18 పేజెస్' సినిమాలో నిఖిల్ నటించాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మంచి పేరును సంపాదించుకుంది. వసూళ్ల పరంగా మరీ 'కార్తికేయ 2' రేంజ్ లో కాకపోయినా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోనే పయనిస్తోందని.. నాన్ థియేటికల్ రైట్స్ తో కలిపితే ఈ చిత్రానికి మంచి లాభాలే వస్తున్నాయని సమాచారం అందుతోంది.
ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో నిఖిల్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఒక అభిమాని 'కార్తికేయ 3' ఉంటుందా? అని ప్రశ్నించారు. అందుకు నిఖిల్ "తప్పకుండా ఉంటుంది" అంటూ ట్వీట్ చేసి మూడో పార్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందన్నట్టు ఫైర్ ఎమోజీని షేర్ చేశారు. ఒక అద్భుతమైన పాయింట్ ను దర్శకుడు ఇప్పటికే చెప్పాడని అన్నారు. కనుక చందు మొండేటిపై ఉన్న నమ్మకంతో నిఖిల్ తదుపరి చిత్రాల జాబితాలో 'కార్తికేయ 3'ని కూడా చేర్చారని సమాచారం.
అసలు కార్తికేయ సబ్జెక్ట్ ఎన్ని సీక్వెల్స్‌కైనా బాగా అనువైన సబ్జెక్ట్ అని, దానిని నిఖిల్ - చందు మొండేటిలు బాగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి 'కార్తికేయ3'ని కాస్త శ్రద్ధ పెట్టి మంచి స్టోరీతో బాగా తీస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని.. హిందీలోనే ఏకంగా రూ. 100 కోట్లను వసూలు చేసుకోగల సత్తా 'కార్తికేయ3'కి ఉందని కొందరు అంటున్నారు. నిజానికి కార్తికేయ సబ్జెక్ట్ మంచి యూనివర్సల్ కాన్సెప్ట్. ఇందులో ఉన్న డెప్త్‌ని చందు మొండేటి-నిఖిల్ జాగ్రత్తగా ప్లాన్ చేసి బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. మరి 'కార్తికేయ3' ద్వారా వారు ఇదే ముందు చూపును ప్రదర్శిస్తారో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



