'యుగానికి ఒక్కడు-2'.. ధనుష్, కార్తి పోస్టర్ అదిరింది!
on Dec 30, 2022

2010లో వచ్చిన తమిళ చిత్రం 'ఆయిరత్తిల్ ఒరువన్' తెలుగులో 'యుగానికి ఒక్కడు' పేరుతో విడుదలైంది. సూర్య సోదరుడు కార్తి హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. మొదట ఈ సినిమా ద్వారానే తెలుగులో కార్తికి పాపులారిటీ వచ్చింది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పటికీ తెలుగులో అద్భుతం అని పొగిడే సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు.
చాలా ఏళ్ల తర్వాత పాన్ ఇండియా, పాన్ వరల్డ్ క్రేజ్ దృష్ట్యా యుగానికి ఒక్కడు సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్లో హీరోని మాత్రం మార్చేశారు. కార్తికి బదులుగా ఆయన స్థానంలో ధనుష్ ని హీరోగా తీసుకున్నారు. ఎందుకంటే ధనుష్ అంటే ఒకట్రెండు హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. దాంతో 'యుగానికి ఒక్కడు 2' లో ధనుష్ ని హీరోగా తీసుకోవడం వలన పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీకి కాస్త క్రేజ్ వస్తుందని మేకర్స్ ఆశ. దీంతో కార్తి ఫాన్స్ కొద్దిగా అప్సెట్ అయ్యారు.
ఇక లేటెస్ట్ గా 'యుగానికి ఒక్కడు' చిత్రంలో ధనుష్ తో పాటు కార్తి కూడా ఉండేలా అభిమానులు ఓ పోస్టర్ ని డిజైన్ చేశారు. మొత్తానికి ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రం అదిరిపోయిందని అర్థమవుతుంది. ధనుష్ తో పాటు కార్తి కూడా ఈ సినిమాలో ఉంటే ఇంకా లెక్క వేరేలా ఉంటుంది. ధనుష్, కార్తి ఇద్దరికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో ఈ మూవీకి తమిళం తో పాటు తెలుగులో కూడా ఒకేసారి మంచి క్రేజ్ రావడం ఖాయం.
ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. సెల్వ రాఘవన్ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. సినిమాని 2024 లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. కార్తి, ధనుష్ ఇద్దరు వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. నిజంగానే 'యుగానికి ఒక్కడు 2' లో ధనుష్ తోపాటు ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో ఉన్నట్టు కార్తి కూడా ఉంటే ఆ సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశముందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



