చికెన్, మందు ఏర్పాటు చేస్తే... ఆ రాత్రి ఎడారిలో ఉన్నాడు!
on May 2, 2020

ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రిషి మరణించిన వెంటనే వాళ్లిద్దరూ నటించిన ‘డి–డే’లో క్లిప్ ఇంటర్‌నెట్‌లో వైరల్ అయింది. ఎడారిలో ఆ సినిమా షూటింగ్ కొంత చేశారు. ఒక సన్నివేశంలో సూర్యోదయాన్నే రిషి కపూర్ మీద కొన్ని షాట్స్ తీయాలి. ఉదయమే షూటింగ్ చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. అసలు, ఆయన ఉదయం నిద్రలేవరు. షూటింగ్ స్పాట్‌కి ఆయన ఉండే హోటల్ నుండి రెండు గంటల ప్రయాణం. ఉదయమే షూటింగ్ అంటే ‘నేను యాక్టర్. పాలవాడిని కాదు’ అని రిషి కపూర్ సీరియస్‌గా చెప్పారట. ఏం చేయాలోనని దర్శకుడు నిఖిల్ అద్వానీ తీవ్రంగా మథనపడుతున్న సమయంలో ఇర్ఫాన్ ఖాన్‌కి విషయం తెలిసింది.
రిషి కపూర్ ఆ రాత్రి ఎడారిలో ఉండేలా ఆయన ఒప్పించారు. ఎలాగో తెలుసా? రిషి కపూర్ కోరిన చికెన్ జుంగ్లీ, మందు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి! నిజం చెప్పాలంటే... అప్పటికప్పుడు ఎడారిలో ఆ రెండూ ఏర్పాటు చేయడం కష్టమే. ఎందుకంటే... షూటింగ్ జరుగున్నది గుజరాత్‌లోని కచ్ ఎడారిలో. కొంత సమయం తీసుకున్న ఇర్ఫాన్ ఖాన్ తన మాట నిలబెట్టుకున్నారు. రిషి కపూర్‌కి చికెన్, మందు తెప్పించారు. ఆ రాత్రికి ఎడారిలో టెంట్స్‌లో నిద్రపోయి రెండో రోజు సూర్యోదయాన్నే షాట్స్ తీశారు. దర్శకుడు నిఖిల్ అద్వాని అప్పటి సంగతులను గుర్తు చేసుకుని ఇద్దర్నీ తలచుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



