బాలకృష్ణ సరసన ముంబై ముద్దుగుమ్మే!
on May 1, 2020

నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ రెండు గెటప్పులో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోరా క్యారెక్టర్. దీనికి హీరోయిన్ ఉండదు. రెండో క్యారెక్టర్ రెగ్యులర్ లుక్‌లో ఉంటుంది. దీనికి కథానాయిక అవసరం. తొలుత బాలకృష్ణ పక్కన ఫలనా కథానాయిక నటించబోతుందంటూ పలువురి పేర్లు వినిపించాయి. ఒకానొక సమయంలో అంజలిని ఖరారు చేశారనే మాట కూడా వినిపించింది. చివరకు, అవన్నీ నిజం కాదని దర్శకుడు బోయపాటి తెలిపారు. సినిమాలో ఇద్దరు కథానాయికలు లేరనీ, ఒక్కరే ఉన్నారనీ, బాలయ్య బాబు సరసన ఒక కొత్తమ్మాయిని పరిచయం చేస్తారని ఆయన వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ముంబై ముద్దుగుమ్మ ఒకరిని బోయపాటి శ్రీను ఖరారు చేశారట. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆమె వివరాలు వెల్లడిస్తారట. ‘జై సింహా’తో నటాషా దోషిని టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేశారు. అంతకు ముందు ‘లెజెండ్’తో రాధికా ఆప్టేను తెలుగుకు తీసుకొచ్చారు. ఇలా చెబుతూ వెళితే చాలామంది కథానాయికలను ఇంట్రడూస్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



