నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు: నిధి అగర్వాల్
on May 2, 2020
'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్ గుర్తుంది కదూ! సన్నివేశాల్లో సైంటిస్ట్‌గా చక్కగా, పాటల్లో హాట్‌గా కనిపించింది. అంతకు ముందు నాగచైతన్య 'సవ్యసాచి', అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమాల్లో సోలో హీరోయిన్గా నటించింది. ఇప్పుడీ అందాల నిధి అగర్వాల్ బాయ్‌ఫ్రెండ్, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ గురించి మాట్లాడుతోంది. సడన్‌గా ఈ టాపిక్స్ తీయడానికి కారణం ఆడియన్స్. 'నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?', 'నీ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నా' వంటి ప్రశ్నలు అడగడంతో ఆమె సరదాగా చిరు కోపాన్ని ప్రదర్శించింది.
"నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు. అలాగే, నాకు ఎంగేజ్మెంట్ కూడా కాలేదు" అని నిధి అగర్వాల్ స్పష్టం చేసింది. మామూలుగా సినిమాలు, షూటింగుల నిమిత్తం ముంబైలో ఉండే ఈ హీరోయిన్, ప్రస్తుతం బెంగళూరులో తల్లిదండ్రులతో కలిసి చిన్నప్పటి నుండి పెరిగిన ఇంట్లో ఉంటోంది. పెళ్లి గురించి ఎదురు చూస్తున్నానని ప్రశ్నించిన వ్యక్తికి అయితే "ఎందుకు?" అని ఎదురు ప్రశ్నించడమే కాదు... కాళికాదేవి అవతారం ఎట్టి శూలంతో చంపేయాలని ఉందన్నట్టు ఒక వీడియో పోస్ట్ చేశారు.