తేజూ.. నిహారిక.. పెళ్లి చేసుకొంటున్నారా?
on May 8, 2017
.jpg)
నిజంగానే మెగా అభిమానులకు ఝలక్ ఇచ్చే గాసిప్ ఇది. త్వరలోనే మెగా ఇంట పెళ్లి బాజా మోగబోతోందట. సాయిధరమ్ తేజ్‌కీ, నాగబాబు తనయ నిహారికకూ త్వరలోనే పెళ్లి జరగబోతోందన్నది ఆ గాసిప్ సారాంశం. ఇద్దరూ వరుసకు బావా మరదళ్లు అవుతారు. సో... ఇద్దరికీ పెళ్లి చేయడంలో ఎలాంటి విశేషమూ లేకపోవొచ్చు. కానీ.. వీరిద్దరిదీ బంధుత్వం బలపరిచిన వివాహం కాదట. ఇద్దరూ లవ్‌లో ఉన్నారని, అందుకే పెద్దలు పెళ్లి చేయాలని ఫిక్సయ్యారని చెబుతున్నారు. సాయిధరమ్ తేజ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకొన్నాడు. హీరోగా దాదాపుగా సెటిల్ అయిపోయినట్టే. అందుకే నాగబాబు కూడా తన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇటీవల నిహారిక `ఒక మనసు` అనే సినిమాలో నటించింది. ఆ సెట్లో తరచుగా సాయి కనిపించేవాడని, అక్కడే వీరిద్దరి ప్రేమకథ మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ గాసిప్ లో నిజమెంతో తెలియాలంటే నిహారిక గానీ, తేజూ గానీ, లేదంటే మెగా ఫ్యామిలీలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



