బాహుబలి వెయ్యికోట్లు కొట్టడానికి కారణం ఈ ఐదు సూత్రాలే
on May 8, 2017
.jpg)
1000 కోట్ల కలెక్షన్స్..భారతీయ సినిమా ఈ ఫీట్‌ను సాధిస్తే చూడాలని ఎంతో మంది కల. విస్తృతమైన మార్కెట్..ప్రపంచం నలుమూలలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ ధీరులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ కల సాకారం కాలేదు. అలాంటిది ఒక ప్రాంతీయ చిత్రం ఆ ఘనతను సాధించింది. అదే బాహుబలి.. విడుదలైన తర్వాతి రోజు నుంచి వంద కోట్లు, రెండొందల కోట్లు, మూడొందల కోట్లు, ఐదు వందల కోట్లు.. ఇలా లెక్క పెరుగుతూనే వుంది. ఇప్పుడది 'వెయ్యి కోట్ల'ను టచ్ చేసి ఈ మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. బాహుబలి ఇంతటి కలెక్షన్ల సునామీ సృష్టించడం వెనుక కొందరి కృషి ఉంది..
* సినిమాను అద్భుతంగా తీర్చిదిద్ది..తెలుగు సినిమాకి ఇంత స్టామినా ఉంది అని ప్రూవ్ చేసిన రాజమౌళీ
* ఐదేళ్లపాటు ఒకే సినిమా కోసం పనిచేసి ఆయా పాత్రల్లో ఒదిగిపోయి జీవించిన నటీనటులు
* రాజమౌళిని నమ్మి కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
* రాత్రింబవళ్లు సినిమా కోసం కష్టపడ్డ రాజమౌళీ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. రమా రాజమౌళీ, కీరవాణి, వల్లి అందరి ఇందులో కృషి చాలా ప్రత్యేకం.
* బాహుబలి మ్యానియాని ముందే ఊహించి మార్కెటింగ్‌ని పక్కాగా ప్లాన్ చేసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. హిందీ సినిమాలకు ధీటుగా ఆయన వర్కవుట్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా కలిసొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



