టీజర్ రివ్యూ : కథలో రాజకుమారి
on May 8, 2017

చేతినిండా సినిమాలతో ప్రతీ సీజన్‌లోనూ కనీసం ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకుల్ని పలకరించే హీరో.. నారా రోహిత్. ఈసారి `కథలో రాజకుమారి` ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు. నాగశౌర్య మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నమిత ప్రమోద్ కథానాయికగా నటిస్తోంది. మహేష్ సూపరనేని దర్శకత్వం వహించారు. టీజర్‌ని చిత్రబృందం బయటకు వదిలింది. ''నాకెన్నో రూపాలు - నాకేవో కోపాలు.. కానీ ఒక్కటే ప్రేమ'' అంటూ టీజర్‌ని కవితాత్మకంగా మొదలెట్టారు. 'అంత ఈజీనా, మనం ప్రేమించేవాళ్లపై పగ తీర్చుకోవడం?' అంటూ కథలో కీలకమైన మలుపుని టీజర్‌లోనే చెప్పేశారు. రోహిత్ రెండు మూడు రకాల గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. నాగ శౌర్యకూడా ఇదివరకటికంటే కాస్త డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. 'నా ప్రేమకథకి నేనే హీరో - నేనే విలన్ ' అంటూ... మరో ట్విస్టుతో ఈ టీజర్‌ని ముగించాడు. టీజర్‌లోనే ఇన్ని ట్విస్టులుంటే.. మరి సినిమాలో ఇంకెన్ని ఉంటాయో..?? సంభాషణలు, టేకింగ్, మేకింగ్.. ఇవన్నీ టీజర్‌లో ఆకట్టుకొన్నాయి. ఇదే స్థాయిలో వెండి తెరపైనా మాయ చేయగలిగితే.. ఈ రాజకుమారి జనాలకు నచ్చేయడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



