'నేనింతే' అంటున్న నిహారిక.. ఫోటో షూట్‌లతో దూకుడు!
on Jun 15, 2022

వివాదాలలో చిక్కుకుని, వార్తల్లో వ్యక్తిగా మారాక రెండు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా మెలగింది నిహారిక కొణిదెల. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో పోలీసులు దాడి చేసినప్పుడు, ఆ టైమ్‌లో ఆమె కూడా ఆ పబ్‌లో ఉండటం, పబ్‌లోని వారందరినీ పోలీస్ స్టేషన్‌లో కొన్ని గంటల సేపు ఉంచడం, ఆ సందర్భంగా నిహారిక కూడా వారిలో ఒకరిగా స్టేషన్‌లో ఉండి, తర్వాత బయటకు రావడం.. కలకలం సృష్టించింది. ఆమె ఏ తప్పూ చేయలేదని తర్వాత ఆమె తండ్రి నాగబాబు సైతం వివరణ ఇవ్వడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండు నెలల పాటు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసేసింది నిహారిక. తిరిగి ఏప్రిల్ నెలాఖరున సోషల్ మీడియాకు ఆమె తిరిగొచ్చింది. అప్పట్నుంచి రెగ్యులర్‌గా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ వస్తోన్న ఆమె ఇప్పుడు దూకుడు పెంచేసింది. వరుస ఫొటోషూట్స్ చేస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది.
ఫ్యాషన్‌ను ఇష్టపడే ఆమె, రెగ్యులర్‌గా ఫ్యాషన్ దుస్తులతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. అలాగే మూడు రోజుల క్రితం సినిమాల్లో, షోలలో తను పగలబడి నవ్వుతున్న దృశ్యాలను వీడియో రూపంలో షేర్ చేసి, నేనిట్లానే నవ్వుతా అనే క్యాప్షన్‌తో పాటు నేనింతే అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టింది. ఆమె దూకుడు చూస్తున్న ఫాలోయర్స్ నిహారిక తగ్గేదే లే అంటోందని కామెంట్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



