వరుస నెలల్లో అవికా గోర్ సందడి!
on Jun 15, 2022

`ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మావ`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `రాజు గారి గది 3` వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది అవికా గోర్. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు ఆసక్తికరమైన టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా తక్కువ గ్యాప్ లోనే జనం ముందుకు రానున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఒకరికి ఒకరు` ఫేమ్ శ్రీరామ్ తో కలిసి అవికా గోర్ నటించిన చిత్రం `టెన్త్ క్లాస్ డైరీస్`. నూతన దర్శకుడు `గరుడవేగ` అంజి రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమైంది. కట్ చేస్తే.. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల అనంతరం అంటే జూలై 8న మరో మూవీ రాబోతోంది. అదే.. `థాంక్ యూ`. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కుమార్ తీర్చిదిద్దాడు. ఇందులో రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటించగా అవికా గోర్ మరో నాయికగా దర్శనమివ్వనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ రొమాంటిక్ డ్రామాని నిర్మించారు. మరి.. జూన్, జూలై నెలల్లో కేవలం రెండు వారాల వ్యవధిలో రానున్న ఈ సినిమాలతో అవికా గోర్ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



