నడి రోడ్డు మీద నిహారికా వేషాలు చూడండి!
on Jan 31, 2018
మెగా హీరోలు ఎందరున్నా... మెగా హీరోయిన్ మాత్రం ఒక్కరే ఆమే ‘నిహారిక’. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికే రూటే సపరేటు. నాగబాబు గారాలపట్టి నిహారికా చిన్నప్పట్నుంచీ హైపర్ యాక్టీవ్. అంతేకాదు... స్వతంత్రభావాలున్న అమ్మాయ్. చదువు పూర్తయినప్పట్నుంచీ తను ఏ రోజూ ఖాళీగా ఉండకపోవడానికి కారణం అదే.
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లోని హోటల్లో కొన్నాళ్లు నిహారికా బేరర్ గా చేసిందంటే నమ్ముతారా? ఇది చాలామందికి తెలీని విషయం. బేరర్ గా చేయడం తప్పేం కాదే... ఆ జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఎంత సంతృప్తి కలిగిందో తెలుసా? అంటారామె. మరో విషయం ఏంటంటే... నాగబాబు పర్మిషన్ తీసుకొనే ఆ జాబ్ చేశారు నిహారికా.
ఆ తర్వాత నిహారికా కన్ను నటనపై పడింది. దాని పర్యావసానమే...‘ఒక మనసు’ సినిమా. నాగబాబు కూడా కూతురు ఏమడిగినా కాదనలేని తండ్రి. అందుకే... పెదనాన్న చిరంజీవి అనుమతి కూడా తీసుకొని నటించేసి పర్లేదు బాగానే చేసింది అనిపించుకుంది నిహారిక.
ప్రస్తుతం నిహారికా యాక్టింగ్ కెరీర్ యమ జోష్ గా సాగుతోంది. తండ్రితో కలిసి ‘నాన్న కూచీ’ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది తను.అంతేకాదు.. తమిళంలో విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా రూపొందుతోన్న 'ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్' అనే స్ట్రయిట్ తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ టైటిల్‌కు 'ఒక మంచి రోజు చూసి చెబుతా' అని అర్థం. అయితే ఈ సినిమా తెలుగులో విడుదల కాకపోతుండటం మెగా అభిమానులను నిరాశపరుస్తోంది.
ఇదిలావుంటే... ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్ లో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో ఓ సీతాకోక చిలుకను గుప్పెట్టో పెట్టుకొని నడి రోడ్డు మీదకొచ్చి... దాన్ని గాల్లోకి ఎగరాసి... అది ఎగుతూ వెళ్లుతుంటే... ఆనందిస్తూ... ఓ వీడియోను తన ట్వీటర్ లో పోస్ట్ చేసింది నిహారిక. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్’ చిత్రంలో తన పాత్ర చాలా పెక్యులర్ గా ఉంటుందనీ... నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నానని తెగ సంబరపడిపతోంది ఈ మెగా డాటర్.