మెగా కాపౌండ్ నుంచి ఇంకో హీరో!
on Jan 31, 2018

మెగా కాంపౌండ్ లో ఇప్పటివరకూ ఉన్న హీరోల సంఖ్య ‘6’. త్వరలో ఈ అంకె ‘7’గా మారనుంది. ఒకే కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు రావడం కపూర్స్ ఫ్యామిలీ తర్వాత చిరంజీవి కుటుంబంలోనే జరిగిందేమో. పవన్, బన్నీ, చరణ్, సాయిధరమ్, వరుణ్, శిరీష్... ఇప్పుడు మెగా అల్లుడు ‘కల్యాణ్ దేవ్’.
మెగాస్టార్ చిన్నల్లుడైన కల్యాణ్ దేవ్ కి నటన పట్ల మోజు. అందుకే... హీరో అవ్వాలనే ఆకాంక్షతో రెండేళ్ల పాటు వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. పవన్, మహేశ్, ప్రభాస్ లాంటి స్టార్లకు నటనలో ఓనమాలు దిద్దిన సత్యానంద్... కల్యాణ్ దేవ్ ని కూడా చక్కగా తీర్చిద్దిద్దినట్టు టాక్.
డాన్సుల్లోనూ, ఫైటుల్లోనూ, నటనలోనూ చక్కని ప్రావీణ్యం పొందాడు కాబట్టే.... ఇక ఆలస్యం చేయకుండా కల్యాణ్ దేవ్ సినిమాను పట్టాలెక్కించేశారు మెగాస్టార్. వరాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకుడు. బుధవారం హైదరాబాద్ లో లాంచనంగా ఈ సినిమా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ ఇవ్వగా, కీరవాణి కెమెరా స్విచాన్ చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించాడు. పేరొందిన టెక్నిషియన్స్ పనిచే్స్తున్న ఈ చిత్రానికి మాళవిక నాయర్ కథానాయిక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



