నేను ఇష్టమా..మీ నాన్న ఇష్టమా - నీహారిక
on May 19, 2016

నాగశౌర్య, మెగా ప్రిన్సెన్ నీహారిక జంటగా తెరకెక్కిన ప్రేమకథ ఒక మనసు. నిన్న జరిగిన ఆడియో వేడుకలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మంచి మ్యూజిక్ తో ట్రైలర్ మొదలవుతుంది. నాతో రేపన్న రోజు ఎలా ఉంటుందో తెలియదు అంటూ నాగశౌర్య చెప్పే డైలాగ్, ఆ వెంటనే వర్షం మంచి ఫీల్ ను తీసుకొస్తాయి. మంచి లొకేషన్లలో వచ్చే కొన్ని సీన్ల తర్వాత, డాక్టర్ డ్రస్ లో ఉన్న నీహారిక నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా అని అడుగుతుంది. శౌర్య తడుముకోకుండా నాన్న అని ఆన్సర్ చెబుతాడు. సినిమాలో శౌర్య పాత్ర రాజకీయ నాయకుడని అర్ధమయ్యేలా కొన్ని షాట్స్ కట్ చేసిన తర్వాత నీహారిక మళ్లీ, ఎవరు ఎక్కువ ఇష్టం, నాన్నా, నేనా..? అంటూ మళ్లీ అడుగుతుంది. ఈసారి సమానం అనే ఆన్సర్ ఇస్తాడు హీరో.
అద్భుతమైన సినిమాటోగ్రఫీ, మూవీకి తగ్గట్టుగా సునీల్ కాశ్యప్ ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ చివరికి వచ్చే సరికి అప్పటి వరకూ చూపించిన ప్రేమకథలో, కొద్దిగా బీటలు మొదలవుతాయి. ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. హీరో తండ్రి పాత్రలో రావు రమేష్, ఫ్రెండ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ పాత్రల్ని చూపించిన తర్వాత ఫైనల్ గా, నీమీద ప్రేమ చావదు, మరొకరి మీద ప్రేమ పుట్టదు అంటూ నీహారిక డైలాగ్ తో ట్రైలర్ కు శుభం కార్డు వేశాడు దర్శకుడు. మొత్తం ట్రైలర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, పల్లెటూరిలో జరిగే ఒక సింపుల్ క్యూట్ లవ్ స్టోరీ లా అనిపిస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, ఆ ప్రేమను ప్రభావితం చేసే పరిస్థితులు, ఆ పరిస్థితుల్ని కూడా దాటి తమ ప్రేమను ఆ జంట ఎలా గెలుచుకున్నారు..ఇదే కథాంశం. ఓవరాల్ గా ట్రైలర్ తో తాము ఎలాంటి సినిమా తీశామో పూర్తిగా చెప్పేశాడు దర్శకుడు రామరాజు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



