హీరో రవితేజకు పోలీసుల ఫైన్..!
on May 19, 2016

సెలబ్రిటీ అంటే ఒకప్పుడు చూసీ చూడనట్టు వదిలేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సెలబ్రిటీ అని చెబితే, ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. మొన్నీమధ్యే జూనియర్ ఎన్టీఆర్ కారుకు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు, తాజాగా హీరో రవితేజకు కూడా అదే రిపీట్ చేశారు. జూబ్లిహిల్స్ ప్రాంతంలో చెకింగ్స్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తో ఉండటంతో ఏపీ 28 డీకే 4742 నెంబర్ కారును ఆపారు. అయితే ఆపిన తర్వాత అది హీరో రవితేజ కారు అని తెలిసినా, పోలీసులు మాత్రం తమ ఫార్మాలిటీలను కంప్లీట్ చేశారు. కారుకున్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి 800 రూపాయలు ఫైన్ వేశారు. రవితేజ కూడా చలానా చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సినీ హీరో కావడంతో, రోడ్డు మీద కాసేపు సందడి వాతావరణం ఏర్పడింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



