హీరోగారు నిలబడే ఉన్నారు ఎందుకో...!
on May 19, 2016

సినిమా ఆడియో ఫంక్షన్ అంటే, మూవీలో నటించిన కాస్టింగ్ అంతా మొదటి వరసలో కూర్చుంటారు. ముఖ్యంగా స్టేజ్ కు ఎదురుగా హీరో హీరోయిన్లను కూర్చోబెడతారు. అయితే నిన్న జరిగిన ఒక మనసు ఆడియోలో మాత్రం హీరోగారు పూర్తిగా నిల్చునే ఉన్నారు. ఎక్కడా కూడా నాగశౌర్య కూర్చున్నట్టు కనబడలేదు. సింపుల్ గా చెప్పాలంటే, మొత్తం అటెన్షన్ అంతా మెగా డాటర్ మీదే ఉంది. చివర్లో వచ్చి నాలుగు మాటలు చెప్పాడు తప్ప, శౌర్యకు పెద్ద ప్రాముఖ్యత లభించినట్టు అనిపించలేదు. బహుశా మొత్తం మెగా స్టార్ హీరోస్ అందరూ వస్తుండటంతో వాళ్లకోసం హీరోగారు సైడ్ కి వెళ్లిపోయినట్టున్నారు. సిగ్గో, భయమో, గౌరవమో లేక మూడూ కలిసి వచ్చాయో గానీ శౌర్య వినయంగా నిలబడే ఉన్నాడు. ఈ సింప్లిసిటీతో అతని స్థాయి పెరిగిందని చెప్పాలి. సినిమాలో హీరోగా చేసి కూడా పక్కన సైలెంట్ గా నిలబడటం ఇప్పుడున్న హీరోల్లో చాలా రేర్ క్వాలిటీ. ఇంతకీ సినిమాలోనైనా శౌర్య క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుందా..లేక మెగావారమ్మాయి పైకే వెళ్లిందా..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



