నాని ఇంక మారడా?
on Feb 4, 2017
.jpg)
హీరో నానికి ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఎలా ఉన్నా సేఫ్ బిజినెస్ జరుగుతుంది. అందుకే, చిన్నా, పెద్దా నిర్మాతల ఛాయిస్ నానినే . అయితే, ఈ ఈగ స్టార్ మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.
మజ్ను బెడిసికొట్టడంతో, నాని ఆశలన్నీ నేను లోకల్ మీదే పెట్టుకున్నాడు. సినిమా ఒకసారి చూసి నవ్వుకోవడానికి బాగానే ఉన్నా, అంత గొప్పగా మాత్రం లేదు. ఒక మూడు, నాలుగు సినిమాలు కలిపి తీసినట్టుగా అనిపిస్తుంది. ఇడియట్, సినిమా చూపిస్తా మావ, ఆర్య సినిమాల ఛాయలు కనిపిస్తాయి. మొదటి అర్ధ భాగం పర్లేదు అన్నట్టుగా ఉన్నా, ద్వితీయార్ధం తలనొప్పి తెప్పిస్తుంది. నాని ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఈ సినిమాని ఇంకెవరు చేసినా నిర్మాతకి పెద్ద దెబ్బయ్యేది.
నాని అరుదుగా ప్రయోగాలు చేసినా, ఎక్కువగా రొటీన్ కథల్నే ఎన్నుకుంటున్నాడు. ఇలాగే, చేస్తే ముందు ముందు నాని కూడా బోర్ కొట్టొచ్చు. కెరీర్ పరంగా ముందుకు వెళ్లాలంటే, అప్పుడప్పుడు విభిన్న కథల్ని ఎన్నుకోవాలి. చూద్దాం, నాని సేఫ్ గేమ్ ఆడతాడా, లేక ప్రయోగాలు చేస్తాడా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



