మెగా బ్రదర్స్ ప్యాకేజీ ఎంత?
on Feb 4, 2017

చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోందన్న ప్రకటన రావడం, ఆ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడన్న విషయం ఖరారు కావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్లెప్పటి నుంచో కలలు కంటున్న క్రేజీ కాంబినేషన్ ఇది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చిరు, పవన్‌ల కాంబో సెట్టవ్వడం సాధ్యం కాదనుకొన్నారంతా. కానీ...వీరిద్దరిని ఒప్పించి, టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టుకు తెరలేపారు సుబ్బరామిరెడ్డి. ఓ వ్యాపారవేత్తగా, కళాబంధుగా పేరు తెచ్చుకొన్న సుబ్బరామిరెడ్డి లోగడ నిర్మాత కూడా. చిరంజీవితో స్టేట్ రౌడీ తెరకెక్కించింది ఆయనే. రాజ్యసభ సభ్యుడుగానూ పేరు తెచ్చుకొన్నారు. కొన్నాళ్లుగా నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు తీయాలన్న ఆలోచన కలిగిందాయనకు.
తీస్తే గీస్తే అలాంటిలాంటి సినిమా ఎందుకు చేయాలి? టాలీవుడ్‌ని షాక్ చేసే సినిమాతోనే రావాలని ఆయన ఫిక్సయ్యారు. అందుకే కనీ వినీ ఎరుగని కాంబినేషన్ సెట్ చేశారు. అయితే చిరుకీ, పవన్‌కీ, త్రివిక్రమ్‌కీ పారితోషికంగా ఎంతిస్తున్నారు? ఏం ఇస్తున్నారన్న చర్చ టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది. ఈ ముగ్గురికీ కలిపి సుబ్బరామిరెడ్డి ఓ ప్యాకేజీ ఇచ్చేశారని ఈ ముగ్గురి పారితోషికమే దాదాపుగా రూ.65 కోట్ల వరకూ ఉంటుందని టాలీవుడ్ టాక్. చిరు రూ.25 కోట్లు పవన్ రూ.25 కోట్లు, త్రివిక్రమ్ 15 కోట్లు పంచుకొంటారన్నమాట. ఈ అంకెలు టెమ్టింగ్‌గా అనిపించేసరికి చిరు, పవన్‌లు జట్టు కట్టడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



