'నేనొక నటుడ్ని' షాయరీ.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'మెగా' కంఠం!
on Dec 21, 2022

ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడిగా ఎన్నో సంచలన విజయాలను అందుకున్న కృష్ణవంశీ కొంతకాలంగా విజయాల వేటలో వెనకబడ్డారు. ఏకంగా ఐదేళ్ళ తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో 'రంగమార్తాండ'పై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దెబ్బకి ఒక్కసారిగా ఈ చిత్రంపై అందరి దృష్టి పడింది.
'రంగమార్తాండ' నుంచి 'నేనొక నటుడ్ని' అనే షాయరీని తాజాగా విడుదల చేశారు. లక్ష్మీభూపాల్ రాసిన ఈ షాయరీకి చిరంజీవి గాత్రం అందించారు. "నేనొక నటుడ్ని.. నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని. నేనొక నటుడ్ని.. నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను." అంటూ చిరంజీవి స్వరంతో ఒక్కొక్క లైన్ వినిపిస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఇక లక్ష్మీభూపాల్ అక్షరాలు నటుడి నివాళి అన్నట్లుగా గుండెల్ని హత్తుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా "హరివిల్లుకి ఇంకో రెండు రంగులేసి నవరసాలు మీకిస్తాను. నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బ్రతుకుతుంటాను" అనే లైన్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇక ఈ షాయరీకి ఇళయరాజా అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



