హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి టాప్-10 లో 'ఆర్ఆర్ఆర్'!
on Dec 21, 2022

అంతర్జాతీయ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డులను గెలుచుకొని సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రముఖ మ్యాగజైన్ 'సైట్ అండ్ సౌండ్' ప్రకటించిన 2022 టాప్ చిత్రాలలో భారీ హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి 'ఆర్ఆర్ఆర్' తొమ్మిదో స్థానంలో నిలిచింది.

2022 కి గాను టాప్-50 చిత్రాలను 'సైట్ అండ్ సౌండ్' తాజాగా ప్రకటించింది. అందులో మొదటి మూడు స్థానాల్లో 'ఆఫ్టర్ సన్', 'సెయింట్ ఓమర్', 'డెసిషన్ టు లీవ్' నిలవగా.. ఎన్నో హాలీవుడ్ చిత్రాలను వెనక్కి 'ఆర్ఆర్ఆర్' ఏకంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ ఫిల్మ్ 'టాప్ గన్ మావెరిక్' ఎక్కడో 38వ స్థానంలో ఉంటే.. 'ఆర్ఆర్ఆర్' తొమ్మిదో స్థానం దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే జోష్ లో ఆస్కార్స్ లోనూ నామినేషన్స్ దక్కించుకొని సత్తా చాటుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



