క్యాంటీన్ల వాళ్ళ కడుపు కొడితే సినిమా విడుదల చేయమంటున్నారు!
on Dec 21, 2022

సినిమా అనేది మన దేశంలో అతి తక్కువ డబ్బుతో వినోదాన్ని అందించే ఏకైక వినోద సాధనం. అది తక్కువ ఖర్చులో కావాల్సిన వినోదాన్ని ఇచ్చే సినిమాలకు ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కడతాడు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఆ క్రేజ్ తగ్గింది. యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కరోనా సమయంలో ఓటిటీ ప్లాట్ ఫామ్ బాగా పాపులర్ కావడంతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. ఇక విషయానికి వస్తే మన దేశంలోని చిత్రాల నిడివి చాలా ఎక్కువ. బాలీవుడ్ లో మూడున్నర నాలుగు గంటల సినిమాలు కూడా ఉండేవి. తెలుగులో రెండున్నర మూడు గంటలు సర్వసాధారణం. ఒకనాడు టాలీవుడ్ లో కూడా నాలుగు గంటల సినిమాలు వచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ ప్రస్తుతం రెండు, రెండు నాలుగు గంటలకే మన ప్రేక్షకులు కూడా ఫిక్స్ అవుతున్నారు. అంతకంటే ఎక్కువ నిడివి ఉంటే బోర్ గా ఫీల్ అవుతున్నారు. ల్యాగ్ ఎక్కువగా ఉందని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఎడిటింగ్ వాళ్లకి కత్తి మీద సామైపోయింది.
ఇక సినిమాను థియేటర్కు వెళ్లి చూడాలంటే పెరిగిన రేట్ల దృష్ట్యా అది నేడు సామాన్యులకు, మధ్య తరగతి వారికి అందని ద్రాక్ష పండుగ మారింది. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్ లు వచ్చిన తర్వాత సినిమా అనేది తక్కువ ఖర్చుతో లభించే వినోద సాధనం నుంచి కాస్ట్లీ వ్యవహారంగా మారిపోయింది. వాస్తవానికి థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లి చూస్తే అక్కడి స్కూటర్ సైకిల్ కార్ స్టాండ్ వాళ్ళు ఇంటర్వెల్‌లో అంటే విరామ సమయంలో తినుబండారాలు, కూల్‌డ్రింక్‌లు అమ్ముకునేవారికి పరోక్షంగా ఉపాధి లభించేది. కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్ లలో పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్‌లు వెలుస్తున్నాయి. సినిమా టికెట్ ధర 500 అయితే పాప్‌కార్నర్లు, ఇతర తినుబండారాలు కూల్ డ్రింక్ ధర వెయ్యి రూపాయలుగా పలుకుతుంది. దాంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. సినిమా ధియేటర్ల వారికి సినిమా టికెట్ల మీద వచ్చే లాభం కంటే ఇంటర్వెల్లో ఫుడ్ ఐటమ్స్ మీద వచ్చే లాభమే అధికంగా ఉంది అందుకే వారు కచ్చితంగా ప్రతి చిత్రానికి కూడా ఇంటర్వెల్ ఉండాలి. ఇంటర్వెల్ లేకుండా ప్రదర్శించడం వీలు కాదు అంటున్నారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న హీరోయిన్ నయనతార. తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తూ, నటిస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై ఈ జంట సినిమాలు నిర్మిస్తోంది. ఆమె ప్రస్తుతం కనెక్ఠ్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ అశ్విన్ శరవణన్ ఈ మూవీకి దర్శకుడు. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా చిత్ర ప్రదర్శనకు థియేటర్ల ఓనర్స్ నిరాకరించి మూవీ యూనిట్కు షాక్ ఇచ్చారు.
హర్ర థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ కనెక్ట్ సినిమా డిసెంబర్ 22న అంటే రేపు విడుదల కానుంది. 99 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను బ్రేక్ లేకుండా అంటే ఇంటర్వెల్ అనేది లేకుండా ప్రదర్శిస్తామని నిర్మాత విగ్నేష్ శివన్ గతంలో తెలిపాడు. ఇప్పుడు ఇదే ఈ సినిమాకు తంటాలు తెచ్చిపెట్టింది. ఇంటర్వెల్ లేకుండా ఈ సినిమాను ప్రదర్శించేందుకు ధియేటర్ ఓనర్స్ నిరాకరించారు. ఎందుకంటే బ్రేక్ లేకుండా సినిమా ఏకధాటిగా ప్రదర్శిస్తే ఇంటర్వెల్లో ఫుడ్ కోర్టు నుంచి వచ్చే ఆదాయాన్ని థియేటర్ ఓనర్స్ నష్టపోతారని తెలుస్తోంది ఈ కారణంతో కనెక్ట్ సినిమాను రిలీజ్ విషయంలో థియేటర్స్ వెనుకడుతున్నాయట. అయితే ముందుగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ తమకు చెప్పలేదని....సినిమా ప్రమోషన్స్ ద్వారానే తమకు తెలిసిందని థియేటర్ యాజమాన్యం అంటోంది. ప్రస్తుతం నిర్మాణ సంస్థకు థియేటర్ ఓనర్స్ కు మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



