పవన్‌కి నయీం వార్నింగ్
on Aug 19, 2016
ఆ...ఆగండండి మీరక్కడే ఆగండి... పవన్‌కి నయీం వార్నింగ్ ఇచ్చాడా అంటూ ఏదేదో వూహించుకోకండి. అసలు విషయం
ఏంటంటే..ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ నయీం బ్రతికున్నపుడు ఎంత చేశాడో తెలియదు గానీ చనిపోయిన తర్వాత మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. అతని కేసును విచారిస్తున్న "సిట్" బృందానికి ప్రతిరోజు కొత్త నిజాలు తెలుస్తూనే ఉన్నాయి. ఎంతోమందిని బెదిరించి వేలకోట్లు కూడబెట్టిన నయీం, తెలుగు సినీ పరిశ్రమలోనూ వేలు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక స్టార్ ప్రోడ్యూసర్‌ని బెదిరించినట్లు డబ్బులు దండుకొన్నట్లు ఆధారాలు లభించాయి. అది కూడా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన వ్యక్తినే. నయీం వార్నింగ్‌లకు భయపడిన ఆ నిర్మాత ఏకంగా 8.5 కోట్ల రూపాయలు ముట్టచెప్పినట్లు సిట్ గుర్తించింది. నయీం బెదిరింపులు ఆ ఒక్కరికే పరిమితం కాలేదు..కిందిస్థాయి నుంచి వచ్చిన అనేకమందిని ఇలాగే వేధింపులకు గురిచేసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. సో అదన్న మాట అసలు విషయం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
