ఫ్యామిలీ దిగిపోయినా... ప్రయోజనం లేదేమీ?
on Aug 20, 2016
చెట్టు పేరుచెప్పుకొని కాయలు అమ్ముకోవడం సినిమాల్లోనే ఎక్కువ కనిపిస్తుంటుంది. మా తాత.. మా మావయ్య.. మా పెదనాన్న... అంటూ బిల్డప్పులు ఇస్తుంటారు హీరోలు. సుశాంత్ సినిమా ఆటాడుకుందాం రాలో ఇదే కనిపించింది. అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని వాడేసుకొన్నాడు సుశాంత్ బాబు. అఖిల్ కోసం ఓ పాట సెట్ చేశాడు. నాగచైతన్యకు ఓ సీన్ ఇచ్చాడు. అందులో నాగ సుశీల కూడా కనిపించారు. అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తావన సెకండాఫ్ అంతా వస్తూనే ఉంటుంది. నాగార్జున పేరూ వినిపించింది. అక్కినేని వెంకట్ పేరూ వాడేశారు. అమల, సుమంత్ పేర్లు తప్ప.. దాదాపు అక్కినేని ఫ్యామిలీ ప్రస్తావన సినిమా అంతా వస్తుంటుంది.
అయినా సరే... ఈ సినిమాకి దాని వల్ల కనిపించిన ప్రయోజనం శూన్యం. అఖిల్ ఆ పాటలో ఎందుకు కనిపిస్తాడో అర్థం లేకుండా పోయింది. సినిమా చేసి చాలా రోజులైంది కదా, డాన్స్ ప్రాక్టీస్‌కి పనికొస్తుంది అని... రెండు స్టెప్పులేసి వెళ్లిపోయాడేమో. ఇక చైతూ గెస్ట్ రోల్ కూడా వేస్టు. అది కూడా అప్పటికప్పుడు అల్లుకొన్న సీన్‌లా అనిపిస్తుంది. ఇలా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాని మోయడానికి తెగ కష్టపడింది. కానీ ఏం లాభం? సినిమాలో విషయం ఉండాలి కదా? అది లేకపోతే ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా ఆడియన్స్ పట్టించుకోరన్న విషయం ఈ సినిమాతో మరోసారి అర్థమైంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
