ఆది కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
on Aug 19, 2016

వీరభద్రం దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, మరియు ఎస్‌ఆర్‌టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి మంచి రివ్యూస్ దక్కించుకుంటోంది. మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న చుట్టాలబ్బాయి కామెడీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల వారిని అలరిస్తోంది. ఆది కరియర్ లోనే హైయెస్ట్
ఓపెనింగ్ కలెక్షన్ లతో నిలిచిన చుట్టాలబ్బాయి ఇప్పటికే 350 థియేటర్ లలో రిలీజ్ కాగా ఇప్పుడు అటు ఆంధ్రా, ఇటు నైజాంలోను రిలీజైన అన్ని చోట్లా థియేటర్ లను పెంచే పనిలో ఉన్నారు చిత్రం యూనిట్. రిలీజైన ప్రతి సెంటర్ లోను హౌజ్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్న చుట్టాలబ్బాయి ఆది కరియర్ ని మలుపు తిప్పడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



