'కేజీఎఫ్ టైమ్స్' వార్తలు చూశారా?
on Jan 5, 2021

ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్యాన్ ఇండియా మూవీస్‌లో ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాక్‌స్టార్ యష్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్యాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో సినిమాలను నిర్మిస్తోన్న హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా ‘కేజీయఫ్ చాప్టర్ 2’ టీజర్‌ను 2021, జనవరి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం రిలీజ్ చేసిన ప్రమోషనల్ స్టఫ్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఒక పాతకాలం నాటి పేపర్ కటింగ్‌లా దాన్ని మేకర్స్ రూపొందించారు. 'కేజీఎఫ్ టైమ్స్' అనే మస్ట్‌హెడ్‌తో వార్తా పత్రికలా కనిపిస్తోన్న ఆ కటింగ్‌లో 'కేజీఎఫ్ 2'కు సంబంధించిన పలు అంశాలతో హెడ్‌లైన్స్, వాటి కింద వార్తలు కనిపిస్తున్నాయి.
"రాకీ దేన్ని ఎంచుకుంటాడు? ప‌్రేమనా లేక అధికారాన్నా?" అనేది మెయిన్ హెడ్‌లైన్‌గా, "తన బ్రాండ్ పెంచుకోవడానికి ఇంకెంత దూరం వెళ్తాడు?" అనేది దానికి ట్యాగ్‌లైన్‌గా కనిపిస్తోంది. వాటి కింద చిన్న పిల్లవాడిని ఆడిస్తోన్న తల్లి ఫొటో, మనుషులు కనిపించకుండా హీరోయిన్ చేతిని హీరో పట్టుకున్నఫొటో కనిపిస్తున్నాయి. తర్వాత "మాట కోసం నిలబడేవాడు", "ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ బతుకుతుందా?", "జాదుగాడు తన ప్రేయసిని పొందగలడా?" లాంటి హెడ్‌లైన్స్ అందులో చూడవచ్చు. మస్ట్‌హెడ్ పక్కన "చివరి ప్రచురణ" అని వేయడాన్ని బట్టి చూస్తే, కేజీఎఫ్ చాప్టర్ 2తో ఈ కథ పూర్తవుతుందనీ, ఇక వేరే చాప్టర్స్ ఉండవనీ భావించవచ్చు.
సంజయ్ దత్ విలన్ అధీరగా నటిస్తోన్న ఈ చిత్రంలో రవీనా టాండన్, నిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రధారులు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



