మహేష్ చుట్టూ బాలీవుడ్ హీరోయిన్లు!
on Dec 21, 2022

ఏ మాటకా మాటే చెప్పుకోవాలి గాని తెలుగులో ఎంతమంది స్టార్స్ ఉన్నా బాలీవుడ్ భామలు ఎక్కువగా కొందరితోనే నటించాలని ఆశ పడుతూ ఉంటారు. నిన్నటి తరంలో ఆ స్థానం కింగ్ నాగార్జునది అయితే నేడు ఆ స్థానాన్ని ఆక్రమించిన స్టార్ మహేష్ బాబు అని చెప్పాలి. ఇంకా మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన తండ్రి కృష్ణ లేగసిని అద్భుతంగా ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ఇటీవలే తల్లి, అన్న, తండ్రిని కోల్పోయిన మహేష్ కాస్త రెస్ట్ మూడ్ లో ఉన్నాడు. అయితే ఈ ఏడాది ఈ అవాంఛనీయ సంఘటన వలన కొత్త ఏడాది కోసం వెకేషన్‌గా ఆయన ఎక్కడికి వెళ్లడం లేదు. ప్రస్తుతం మహేష్ కెరీర్ పరంగా చూసుకుంటే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక గతంలో ఆయన 2005లో అతడు 2017లో ఖలేజా చిత్రాలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేశాడు. ఇందులో అతడు చిత్రం మంచి విజయం సాధించగా ఖలేజా చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది.
కానీ ఈ రెండు చిత్రాలు ఇప్పటికీ ఏదైనా టీవీ చానల్స్ లో వస్తుంటే జనాలు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఆయా చిత్రాలకు ఇంత కాలమైనా మంచి టీఆర్పీలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ల కాంబోలో హ్యాట్రిక్ మూవీకి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ను షూట్ చేసుకున్నారు. ఈ పార్ట్ మొత్తం సూపర్బ్ గా వచ్చినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ప్రారంభించనున్నారు.
ఈ మూవీలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటించనుందని సమాచారం. ఇక నిన్నటి తరం హాట్ బ్యూటీ టబూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు పై మనసు పారేసుకునే ఆంటీగా ఈమె కనిపించింది సమాచారం. అంధాధూన్ చిత్రంలో కూడా ఈమె ఇదే తరహా పాత్రను చేసిన సంగతి తెలిసిందే. అందులో బెడ్ రూమ్ సీన్లలో కూడా ఆమె రెచ్చిపోయి నటించింది.
తాజాగా అలాంటి పాత్రని మహేష్ సినిమాలో చేస్తోందని అంటున్నారు. మరోవైపు ఇదే చిత్రంలో మరో ప్రత్యేకత ను తీసుకురావడానికి త్రివిక్రమ్ నడుంబిగించాడు. మహేష్ కు తల్లి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణిముఖర్జీని తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇవన్నీ నిజమైతే మహేష్ త్రివిక్రమ్ ల మూడో చిత్రం వెండితెర నిండుగా గ్లామర్కు కేరాఫ్ అడ్రస్ గా పాత, కొత్త హీరోయిన్ల హడావుడితో పలు ప్రత్యేకతలు సంతరించుకునే మూవీగా నిలబడుతుందని ఆశించవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



