నయనతార పెళ్లయిపోయింది!
on Jun 9, 2022

విఘ్నేశ్ శివన్ ఈరోజు తెల్లవారుజాము 2:22 గంటలకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక మెసేజ్ పంచుకున్నాడు. 2:22 అనేది దేన్ని సూచిస్తోంది? తమిళ హిందూ సంప్రదాయం ప్రకారం నయనతార, విఘ్నేశ్ పెళ్లి తంతు ఆ టైమ్‌కు మొదలైంది. పెళ్లి వేడుకకు సంబంధించిన పిక్చర్స్ బయటకు లీక్ కాకుండా వేదిక వద్దకు సెల్ ఫోన్లను నిషేధించినట్లు సమాచారం. అతిథులంతా తమ సెల్ ఫోన్లను వేదిక బయటే ఒక సురక్షిత ప్రదేశంలో ఉంచి, వేదిక వద్దకు వచ్చారు.
పెళ్లి వేడుక జరుగుతున్న మహాబలిపురంలోని షెరటాన్ పార్క్ హోటల్‌లోనే జూన్ 7న మెహందీ, సంగీత్ వేడుకలను వధూవరులు జరుపుకున్నారు. దానికి హాజరైన అతిథులకు సరఫరా చేసిన వాటర్ బాటిల్స్‌పై నయన్, విఘ్నేశ్ బొమ్మలతో పాటు, వారి లవ్ స్టోరీలోని వివిధ దశలను కూడా ప్రింట్ చేయడం గమనార్హం.
అందిన సమాచారం ప్రకారం, షెరటాన్ పార్క్ హోటల్‌లో ఏర్పాటుచేసిన ఒక భారీ గాజు మండపంలో నయనతార, విఘ్నేశ్ పెళ్లి కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు రజనీకాంత్, షారుక్ ఖాన్, కార్తీ, రాధిక, శరత్ కుమార్, విజయ్ సేతుపతి, అట్లీ తదితర స్టార్ సెలబ్రిటీస్ హాజరయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



