యూఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకున్న 'మేజర్'
on Jun 9, 2022

ముంబై ఉగ్ర దాడిలో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మేజర్' జూన్ 3న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సంచలనం సృష్టించిన మేజర్ మూవీ తాజాగా మరో ఫీట్ సాధించింది. యూఎస్ లో ఈ మూవీ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. స్టార్ కాస్ట్ లేకపోయినా కేవలం కంటెంట్ తో తక్కువ రోజుల్లోనే యూఎస్ లో 1 మిలియన్ కి పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల బిజినెస్ చేసిన మేజర్.. మొదటి రోజు 7.12 కోట్లు, రెండో రోజు 6.36 కోట్లు, మూడో రోజు 5.87 కోట్లు, నాలుగో రోజు 2.19 కోట్లు, ఐదో రోజు 1.70 కోట్లు, ఆరో రోజు 1.22 కోట్ల షేర్ రాబట్టింది. ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 24.46 కోట్ల షేర్(44.75 గ్రాస్)తో సత్తా చాటింది. త్వరలోనే ఈ మూవీ 50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బిజినెస్ చేసిన మేజర్.. ఆరు రోజుల్లో 14.39 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆరు రోజుల్లో నైజాంలో 6.66 కోట్లు(3.50 కోట్ల బిజినెస్), సీడెడ్ లో 1.59 కోట్లు(2 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో 6.14 కోట్లు(4.50 కోట్ల బిజినెస్) రాబట్టింది. సీడెడ్ లో ఇంకా బ్రేక్ ఈవెన్ అందుకోవాల్సి ఉంది.
వరల్డ్ వైడ్ గా తెలుగు వెర్షన్ 13 కోట్ల బిజినెస్ చేయగా.. ఆరు రోజుల్లోనే 21.26 కోట్ల షేర్ వచ్చింది. ఇతర భాషల్లో 3.20 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



