చిక్కుల్లో నయన్-విఘ్నేశ్ జంట!
on Oct 10, 2022

నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగు నెలలకే తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే వీరు సరోగసి పద్థతిలో తల్లిదండ్రులైనట్లు తెలుస్తోంది. అదే ఇప్పుడు వివాదానికి తెరదీసింది.
భారతదేశంలో సరోగసి బ్యాన్ చేశారు. గర్భం దాల్చలేని పరిస్థితుల్లో తప్ప.. అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడమనేది మన దేశంలో నేరం. ఈ చట్టం ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చింది. దీంతో నయన్, విఘ్నేశ్ చట్ట ప్రకారమే సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ఆరోగ్యశాఖ ఈ జంటకు తాజాగా నోటిసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం.
ఇండియాలో సరోగసి బ్యాన్ చేస్తున్నారన్న వార్త రాగానే నయన్-విఘ్నేశ్ వెంటనే అలర్ట్ అయ్యి పెళ్ళికి ముందే సరోగసి పద్థతిలో తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకొని ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



