'ఆదిపురుష్' టీమ్ కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు!
on Oct 10, 2022

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ పలు వివాదాలకు, విమర్శలకు దారితీసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ మూవీ టీమ్ కి నోటీసులు పంపించడం హాట్ టాపిక్ గా మారింది.
'ఆదిపురుష్' టీజర్ లో వీఎఫ్ఎక్స్ పిల్లల కార్టూన్ లా ఉందంటూ కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం అందులో పాత్రల గెటప్స్ మరీ దారుణంగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రావణుడు, హనుమంతుడి గెటప్స్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామాయణం గురించి అవగాహన లేకుండా సినిమా ఎందుకు చేస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కొందరైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు.
'ఆదిపురుష్' టీజర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఈ చిత్ర విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ కి నోటీసులు జారీ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



