ఫిష్ వెంకట్ కి సాయం చేయకపోవడంపై నట్టికుమార్ కామెంట్స్
on Jul 21, 2025
ప్రముఖ నటుడు 'ఫిష్ వెంకట్'(Fish Venkat)రెండు రోజుల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఫిష్ వెంకట్ కూతురు మాట్లాడుతు 'కిడ్నీ మార్పిడికి కావాల్సినంత డబ్బులు ఉంటే, మా నాన్న బతికే వాడని, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు సాయం చెయ్యలేదని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా కూడా సినీ రంగానికి సంబంధించిన పెద్ద నటులు, టెక్నీషియన్స్ చనిపోతే అందరు వెళ్తారు. కానీ ఫిష్ వెంకట్ చనిపోతే మాత్రం ఎవరు రాలేదనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.
ఈ మొత్తం విషయంపై ప్రముఖ నిర్మాత 'నట్టికుమార్'(Natti Kumar)మాట్లాడుతు ఫిష్ వెంకట్ సినిమాల్లో నటించకుండా చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అందుకే ఆయనతో ఎవరు టచ్ లో లేరు. సినిమారంగం చాలా బిజీ రంగం కావడంతో హీరో, నిర్మాత, డైరెక్టర్స్ క్షణం కూడా తీరిక లేకుండా ఉంటారు. వెంకట్ కి సాయం చెయ్యాలని సోషల్ మీడియా వేదికగా చాలా మంది కోరారు. కానీ ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో మెంబర్ షిప్ కూడా తీసుకోలేదు. ఇండస్ట్రీలో ఎవరి బతుకులు వారివి. ఖచ్చితంగా హీరోలు సాయం చెయ్యాలని రూల్ లేదు.
వెంకట్ గారు రోజుకి మూడు వందల నుంచి ముప్పై వేలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. దాన్ని జాగ్రతగా కాపాడుకుంటే బాగుండేది. నా మాటలు ఫిష్ వెంకట్ కుటుంబానికి బాధ కలిగించవచ్చు. అనవసరంగా డబ్బు వృధా చేసుకోకూడదు. రేపు నేను చనిపోయినా డబ్బు లేకపోతే ఇదే పరిస్థితి. నేను ఎవరితో టచ్ లో ఉంటే వాళ్ళే నా ఇంటికి వస్తారని నట్టికుమార్ చెప్పుకొచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
