ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
on Jul 21, 2025
తను చేసిన సినిమాల ద్వారా కంటే.. పలు రకాల సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరైన నటుడు సోనూ సూద్. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించి.. వారికి తగిన సాయం చేయడంలో సోనూ ఎప్పుడూ ముందుంటారని అందరికీ తెలుసు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో అతను చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. గత కొంతకాలంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇటీవల తుది శ్వాస విడిచిన టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి ఇప్పుడు సోనూ సూద్ అండగా నిలుస్తున్నారు. ఫిష్ వెంకట్ భార్యతో స్వయంగా మాట్లాడిన సోనూ.. వారి కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు.
ఫిష్ వెంకట్ ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా అతని వైద్య ఖర్చుల కోసం పలుమార్లు ఆ కుటుంబం అర్థించింది. అయితే ఈ విషయంలో టాలీవుడ్ ప్రముఖులు తక్కువగానే స్పందించారని చెప్పాలి. అదే సమయంలో సోనూ సూద్ కిడ్నీ దాతల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. దాని కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా అతను సిద్ధపడ్డాడని, అయితే అది కార్యరూపం దాల్చలేదు. అంతేకాదు, ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు సోనూ. అయితే బ్యాంకు సమస్య వల్ల ఆ సాయం అనేది ఫిష్ వెంకట్ కుటుంబానికి చేరలేదు. తాజాగా సోనూ సూద్ స్వయంగా ఫిష్ వెంకట్ భార్యతో మాట్లాడారు. వారి కుటుంబానికి అండగా తాను ఉంటానని ఆమెకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంకట్ తనకు తమ్ముడులాంటి వాడని, తక్షణ సాయంగా లక్ష రూపాయలు పంపిస్తానని చెప్పారు. దానికి సంబంధించిన బ్యాంక్ డీటైల్స్ అన్నీ సోనూ సూద్‌కు అతని పి.ఎ. పంపించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



