ఆ హీరో రోజు భార్య కాళ్ళని తాకుతాడు
on Jul 21, 2025

ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)దర్శకుడు సురేందర్ రెడ్డి(Surendar Reddy)కాంబినేషన్ లో నల్లమలపు శ్రీనివాస్ నిర్మించిన హిట్ చిత్రం 'రేసుగుర్రం'. 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ద్వారా ప్రతి నాయకుడుగా తెలుగు తెరకి పరిచయమైన బాలీవుడ్ నటుడు 'రవికిషన్'(Ravi Kishan). 'మద్దాలి శివారెడ్డి' అనే క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్ తో కూడిన విలనిజాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన సుప్రీమ్, కిక్ 2 , రాధ, ఎం ఎల్ఏ, 'ఎన్టీఆర్(Ntr)కథానాయకుడు' వంటి చిత్రాలు 'రవికిషన్' కి అభిమానులని సంపాదించి పెట్టాయి.
బాలీవుడ్ కూడా తన సత్తా చాటుతున్న'రవి కిషన్' ప్రస్తుతం 'సన్ ఆఫ్ సర్దార్' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'సన్ ఆఫ్ సర్దార్ పార్ట్ 2 'లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఆగస్ట్ 1 న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా రవి కిషన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రవి కిషన్ తో షో హోస్ట్ కపిల్ శర్మ మాట్లాడుతు మీరు ప్రతి రోజు నిద్రపోయేముందు మీ భార్య పాదాలని తాకుతారని అంటారు నిజమేనా అని అడిగాడు. అందుకు రవి కిషన్ బదులిస్తు 'నేను రోజు నిద్రపోయే ముందు నా భార్య పాదాలని తాకుతాను అనేది నిజమే. కాకపోతే నా వైఫ్ ఒప్పుకోదేమో అని, తను నిద్రపోయాక, పాదాలని తాకుతాను. నా దగ్గర పేరు, పలుకుబడి, డబ్బు లేని సమయంలో నా పక్కనే నిలబడింది. ఎన్నో ఒడిదుడుకులని కూడా తట్టుకుంది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా భార్యే కారణం. ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలను. అందుకే కృతజ్ఞతగా ప్రతి రోజు ఆమె పాదాలని తాకుతానని రవి కిషన్ చెప్పుకొచ్చాడు.
రవికిషన్ భార్య పేరు ప్రీతీ కిషన్(Preeti Kishan). 1993 లో వారిద్దరి వివాహం జరుగగా ప్రీతి, రవికిషన్ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. ఈ ఇద్దరకీ నలుగురు సంతానం. రవికిషన్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరపున ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపి గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 'గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)రీసెంట్ హిట్ 'డాకు మహారాజ్' లో 'ఎంఎల్ఏ త్రిమూర్తులు నాయుడు' గా కూడా మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాకముందు హిందీ, భోజ్ పూరి భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన రవి కిషన్ కొన్నింటిలో హీరోగాను చేసాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



