లోకనాయకుడితో ఒక్క ఛాన్స్ కూడా వర్కౌట్ కాలేదు!
on Dec 31, 2022

ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించిన సీనియర్ నటి నదియా. ఈమె అసలు పేరు జరీన. ఎక్కువగా తమిళ మలయాళ సినిమాల్లో నటించింది. ఒకటి రెండు తెలుగు సినిమాలలో హీరోయిన్ గా చేసింది. ముఖ్యంగా తెలుగులో 1988లో వచ్చిన బజార్ రౌడీ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుకు జోడీగా నటించి మెప్పించింది. ఆ తరువాత రాజశేఖర్ తో వింత దొంగలు అనే చిత్రం చేసింది. అది బాగానే ఆడింది. ఇక ఓ తండ్రి ఓ కొడుకు మూవీ లో నటించింది కానీ పెద్దగా అవకాశాలైతే రాలేదు. ఇలా తన తొలి ఇన్నింగ్స్‌లో అందం, నటనా ప్రతిభ ఉన్న ఈమెని తెలుగు పరిశ్రమ ఎందుకో పెద్దగా ఆదరించలేదు. దాంతో చాలా కాలం తర్వాత హీరోలకు తల్లి, అత్త పాత్రలలో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 1994 తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆమె ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన శిరీష్ బోలెను వివాహం చేసుకోంది. 2013లో మరల తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈసారి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మిర్చి చిత్రంలో ప్రభాస్‌కు తల్లి పాత్రను పోషించింది. ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక ఆమెలోని టాలెంట్‌ను మరోసారి వెలికి తీసిన చిత్రం పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది. ఇందులో పవన్ కళ్యాణ్ కు మేనత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక తర్వాత రామ్ హీరోగా నటించిన వారియర్, నాని హీరోగా వచ్చి అంటే సుందరానికి, వరుణ్ తేజ్ నటించిన గని, రామ్ చరణ్ బ్రూస్ లీ, అల్లు అర్జున్ నా పేరు సూర్య, మిస్ ఇండియా, వరుడు కావలెను, మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట ఆమెకు మంచి పేరును తీసుకుని వచ్చాయి. ఇక దృశ్యంలో కుమారుడిపై ప్రేమ కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇక చిత్రంతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరోసారి అ వంటి చిత్రాలు చేసి తన సత్తాను చాటుకుంది. దృశ్యం2లో కూడా యాక్ట్ చేసింది. అయితే ఆమెకి మంచి పేరును తీసుకువచ్చిన చిత్రాలుగా మిర్చి, అత్తారింటికి దారేది, అ..ఆ, దృశ్యం చిత్రాలను చెప్పుకోవచ్చు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేరు సనం, జన.
ఈమెకు ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంటే తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఎక్కువ చిత్రాలు వచ్చాయంటే ఆశ్చర్యం కాదు. ఇక ఈమె కెరీర్ను పరిశీలిస్తే ఈమె ఇన్ని చిత్రాల్లో నటించిన కూడా విశ్వ నటుడు, లోకనాయకుడు కమలహాసన్ తో మాత్రం కలిసి నటించలేదు. కమలహాసన్ కూడా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు దాటింది. ఎందరో దిగ్గజాల లాంటి హీరోయిన్లతో ఆయన నటించారు. విభిన్న పాత్రలలో ప్రతిభావంతులైన హీరోయిన్లతో వందల సినిమాల్లో నటించారు. కానీ 80 నాటి స్టార్ హీరోయిన్ నదియాతో ఇప్పటివరకు ఒక సినిమాలో కూడా నటించలేదనేది చాలామందికి తెలియని విషయం. ఈమె తాజాగా మాట్లాడుతూ కమల్ హాసన్ నాతో సినిమా చేయమని అడిగినప్పుడల్లా నాకు ఎప్పుడూ కాల్ షీట్స్ లేవు అందువలన అలాంటి విలక్షణ నటుని సరసన చాలా పెద్ద అవకాశాలు కోల్పోయాను. ఇప్పుడు కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా కమల్ హాసన్ తో కలిసి ఒక చిత్రంలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ ప్రకటన చూస్తుంటే కమలహాసన్ నటించిన చిత్రాలలో మంచి స్కోప్ ఉన్న పాత్ర కచ్చితంగా ఆమెకు వచ్చేలా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే కమలహాసన్ కు నదియా అన్న నదియా నటన ప్రతిభా అన్న ఎంతో నమ్మకం. ఈ విషయాన్ని అప్పుడెప్పుడో ఒకసారి ఆయన పత్రికలకు తెలిపారు కూడా. త్వరలో కమలహాసన్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విక్రమ్ ఫ్రాంచైజీ తెరకెక్కించనున్నారు. మరోవైపు ఆయన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు తమిళ చిత్రాలలో ఏదో ఒక చిత్రంలో నదియాకు అవకాశం వస్తే అటు ఆమె కోరికతో పాటు ఇద్దరు అద్భుతమైన నటులు స్క్రీన్ ను పంచుకుంటే చూసి ఆనందించే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుందని చెప్పాలి....!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



