ఆ విషయంలో బాలయ్య ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?
on Dec 29, 2016
.jpg)
ఈ సంక్రాంతి సంబరాల్ని రెట్టింపు చేయడానికి నందమూరి బాలకృష్ణ ముస్తాబవుతున్నాడు. తన వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిని ఈ సంక్రాంతికి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. బాలయ్య వందో సినిమా కావడం, హేమామాలిని చాలా కాలం తరవాత తెలుగులో నటిస్తుండడం, జాతీయ అవార్డు అందించిన కంచె తరవాత.. క్రిష్ చేస్తున్న సినిమా ఇది కావడం.. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ సినిమాకి చెప్పలేనంత హైప్ వచ్చేసింది. అన్నట్టు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఈ సినిమాతో నే ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పుకొంటున్నారు. ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిసి మాయమవుతాడని చెప్పుకొంటున్నారు. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడే సంబరాలు చేసుకోవడం మొదలెట్టారు. అయితే.. ఈ సినిమాలో మోక్షజ్ఞ కనిపించే ఛాన్సే లేదని సమాచారం. మోక్షజ్ఞ ఎంట్రీని మరింత గ్రాండ్‌గా జరిపించాలని, ఒకేసారి హీరోగానే వెండి తెరపై చూపించాలని, చిన్న చిన్న పాత్రల్లో వద్దని బాలయ్య డిసైడ్ అయ్యాడట. అందుకే మోక్షజ్ఞ గెస్ట్ రోల్‌లో కనిపించడానికి ఒప్పుకోలేదట. అయితే.. ఈ సినిమాకి మోక్షజ్ఞ సహాయ దర్శకుడిగా పనిచేయడం విశేషం. సినిమాకి సంబంధించిన చాలా విషయాలు ఈ సెట్లోనే మోక్షజ్ఞ నేర్చుకొన్నాడట. అలా... నాన్న 100వ సినిమాలో తానూ భాగం పంచుకొన్నట్టైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



