ఈ లుక్కులేంటి పవనూ.. టూమచ్‌గా!
on Dec 29, 2016
.jpg)
తమ సినిమాని ప్రమోట్ చేసుకొనే విషయంలో మిగిలిన హీరోలంతా పరుగులు పెడుతుంటే.. పవన్ కల్యాణ్ చాలా చాలా వెనుకబడిపోతున్నాడేమో అనిపిస్తోంది. మిగిలిన టాలీవుడ్ హీరోలకంటే ముందుగా 2017 న్యూ ఇయర్ విషెష్ చెబుతూ పోస్టర్లు విడుదల చేసినా.. అవి ఏమాత్రం కిక్ ఇవ్వకపోవడం పవన్ అభిమానుల్ని సైతం నిరాశ పరుస్తోంది. కాటమరాయుడుకి సంబంధించి రెండు కొత్త పోస్టర్లు బయటకు వచ్చాయి. పవన్ పోస్టర్ అంటే ఎలా ఉండాలి?? `కళ``కళ`లాడిపోవాలి. రెండు `కళ`లు కాదు కదా.. కనీసం ఒక `కళ` కూడా లేదు. పవన్ మొహాన్ని దాచేస్తూ కేవలం కాళ్లు, చెప్పులూ చూపిస్తూ తొలి పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. రెండో పోస్టర్ కూడా ఇంతే. ఇది పారగాన్ హావాయ్ చెప్పులు ప్రమోషనా, లేదంటే కాటమరాయుడు పోస్టరో తెలీనట్టుంది పరిస్థితి. కనీసం రాబోయే రోజుల్లో అయినా.. పవన్ ఫొటో చూపిస్తారో లేదంటే ఈసారి వాచీలూ, బెల్టులూ చూపించి మళ్లీ షాకిస్తారో చూడాలి. కనీసం పవన్ పీఆర్ టీమ్ అయినా... ఈ విషయంలో పవన్‌కి కొన్ని సజీషన్స్ ఇస్తే బాగుణ్ణు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



