చిరు పాటకు పోటినిస్తున్నఅభిమాని పాట
on Dec 29, 2016
.jpg)
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నెం.150 మూవీలోని సాంగ్స్‌ని అన్ని ఒకేసారి కాకుండా ఒక్కో సాంగ్‌ని రిలీజ్ చేస్తూ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలైన 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు', 'సుందరి' పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది..తాజాగా మూడో సాంగ్ ఆన్‌లైన్‌లోకి రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
"మీ..మీ..మీమీమీ..ఇకపై ఓన్లీ యూ అండ్ మీ" అంటూ సాగే మెలోడికి మంచి టాక్ వచ్చింది. విడుదలైన 15 గంటల్లోనే 8 లక్షల మందికి పైగా ఈ సాంగ్‌ను విన్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ అభిమానులు కూడా ఆయనపై పాటలను రాసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఆ పాటలు కూడా ఖైదీ నెం.150 పాటలకు పోటీగా ఇంకా చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువగానే వైరల్ అవుతున్నాయి. సత్యసాగర్, హేమచంద్ర, శ్రావ్యమానస పాడిన "నీతో ఉంటుంటే" పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన 16 గంటల్లోనే దీనిని 3 లక్షల మంది వీక్షించి ఒరిజనల్ ఖైదీ నెం.150 సాంగ్స్‌తో పోటీ ఇస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



