మహేష్‌కి మరో ఛాయిస్ లేక...
on Jan 24, 2019

ప్రస్తుతం మహేష్‌బాబు పొల్లాచ్చిలో ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న 'మహర్షి' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అందువల్ల, మొన్న మంగళవారం నమ్రత పుట్టినరోజుకు హైదరాబాద్ రాలేకపోయారు. పెళ్లైన 14 ఏళ్లలో శ్రీమతి పుట్టినరోజు నాడు ఆమె పక్కన మహేష్ లేకపోవడం ఇదే తొలిసారి అట! "మహేష్ కి మరో ఛాయిస్ లేదు. సినిమా విడుదల దగ్గర పడుతోంది. షూటింగ్ చివరిదశలో వుంది. తను ఇక్కడికి రావడం కుదరలేదు. నేను మహేష్ దగ్గరకు వెళదామని అనుకుంటే అబ్బాయికి పరీక్షలు జరుగుతున్నాయి. అందువల్ల, ఈసారి నా పుట్టినరోజు నాడు ఇద్దరం వేర్వేరు ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చింది" అని నమ్రత అన్నారు. ఈసారి స్నేహితులతో కలిసి పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకున్నారామె. ముంబై నుంచి నమ్రత స్నేహితులు హైదరాబాద్ వచ్చారు. అందరూ కలిసి తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ కి వెళ్లి భోజనం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



