పేరు మార్చుకున్న సమంత!!!
on Jan 24, 2019
మ్యారేజ్ తర్వాత సమంత, తను చేయబోయే సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీ ఉన్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత సమంత కెరీర్ మూడు హిట్లు, ఆరు ఆఫర్లు అన్నట్లు సాగిపోతుంది. ఒకపుడు గ్లామర్ పాత్రలకే పరిమితమైన సామ్. ఆ తర్వాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో తన సత్తా ఏందో చూపెడుతోంది. గత యేడాది `రంగస్థలం`, `మహానటి`, `అభిమ న్యుడు`, `యు టర్న్` చిత్రాలతో మంచి ఊపు మీదుంది సమంత. `యు టర్న్` సినిమాకు క్రిటిక్స్ ప్రశంసలు లభించిన కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ప్రజంట్ సమంత, తన నిజ జీవిత భాగస్వామి నాగచైతన్యతో `మజిలీ` సినిమా చేస్తోంది. ఆ తర్వాత సమంత మిస్ గ్రానీ (2014) అనే కొరియన్ ఫిల్మ్ రీమెక్ లో నటిస్తోంది. ఈ సినిమా పైకీ యంగ్ గా కనిపించేందకు ఇష్టపడే ఓల్డ్ లేడీపాత్ర. ఈ సినిమాకు `ఓ బేబి` అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు రంగస్థలంలో `ఎంత సక్కంగున్నావే` అనేది ట్యాగ్ లైన్ గా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు `ఓ బేబి` అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో నాగశౌర్యతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు నటించే అవకాశం ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
