చిరంజీవి గారూ... బరువు తగ్గాలి!
on Jan 24, 2019

ప్రస్తుతం చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమా చేస్తున్నారు. ఇది థియేటర్లలోకి రావడానికి ముందే తన తదుపరి సినిమాను పట్టాలు ఎక్కించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'సైరా' తరవాత సినిమా ఉంటుందని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గాలని అనుకుంటున్నారట. ఆయన్ను బరువు తగ్గమని కొరటాల కోరారని సమాచారం. రాజకీయాల్లోకి వెళ్లిన తరవాత చిరంజీవి చాలా బరువు పెరిగాయి. అయితే మెగా రీ ఎంట్రీ 'ఖైదీ నంబర్ 150' కోసం ఆయన బరువు తగ్గారు. మళ్ళీ 'సైరా'లో పాత్ర కోసం కొంచెం పెరిగారు. కొరటాలతో చేయబోయేది కమర్షియల్ సినిమా కనుక కాస్త తగ్గితే బావుంటుందని చిరంజీవి మనసులో కూడా ఉందట. కొరటాల గత సినిమాల తరహాలో సామాజిక సందేశంతో, వాణిజ్య హంగులతో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇందులో చిరంజీవి సరసన కథానాయికగా నటించబోయేది ఎవరు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆమెతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



