నవంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'ది ఘోస్ట్'
on Oct 25, 2022
నాగార్జున టైటిల్ రోల్ పోషించగా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన 'ది ఘోస్ట్' మూవీ అక్టోబర్ 5న థియేటర్లలో విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. నవంబర్ 2 నుంచి ఆ ప్లాట్‌ఫామ్‌పై ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నది.
ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసింది. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించిన ఈ మూవీలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రధారులు. పాటలకు భరత్-సౌరభ్ సంగీతం సమకూర్చగా, మార్క్ కె. రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ముఖేశ్ జి. సినిమాటోగ్రాఫర్‌గా, దినేశ్ సుబ్బరాయన్, కెచ్చా స్టంట్స్ డిజైన్ చేశారు.
ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలైన 'ది ఘోస్ట్' ప్రేక్షకుల ఆదరణను పొందడంలో విఫలమైంది. దీని బాక్సాఫీస్ ఫలితం నాగార్జునను తీవ్రంగా నిరాశపరిచింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తయారైన ఈ మూవీలో ఆయన ఎంతో శ్రమకోర్చి స్టంట్స్ చేశారు. మరి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో చూడాలి.
Also Read