'జల్లికట్టు' డైరెక్టర్‌తో జట్టు కడుతున్న మోహన్‌లాల్
on Oct 25, 2022

మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అతని అద్భుతమైన అభినయాలను, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఆరాధించే వాళ్లెందరో! ఆయనను మలయాళీలు ప్రేమగా 'లాలెట్టన్' అని పిలుచుకుంటూ ఉంటారు. లేటెస్ట్‌గా ఆయనకు సంబంధించిన ఓ ఎగ్జయిటింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 2021లో భారతదేశపు అధికారిక ఎంట్రీగా ఆస్కార్ అవార్డులకు వెళ్లిన 'జల్లికట్టు' మూవీ డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసెరీతో కలిసి ఓ సినిమాకు ఆయన పనిచేయనున్నారు.
జాన్ అండ్ మేరీ క్రియేటివ్, మాక్స్ ల్యాబ్స్, సెంచరీ ఫిలిమ్స్ సంస్థలు ఈ మూవీని నిర్మించనున్నాయి. మంగళవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని మోహన్‌లాల్ స్వయంగా ప్రకటించారు. లిజో జోస్‌తో కలిసున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.
"ఇండియన్ సినిమాలోని అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరైన లిజో జోస్ పెల్లిసెరీతో నా నెక్ట్స్ మూవీ ఉంటుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. John and Mary Creative, Max Labs and Century Films ఆ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. .#LijoJosePellissery @shibu_babyjohn. (sic)" అని ఆయన ట్వీట్ చేశారు.
మోహన్‌లాల్ చివరగా అక్టోబర్ 21న విడుదలైన 'మాన్‌స్టర్' మూవీలో కనిపించారు. ఈ థ్రిల్లర్‌లో ఒక రహస్యాన్ని కలిగివుండే లక్కీ సింగ్ అనే రోల్ చేశారు. ఇందులో మంచు లక్ష్మి కూడా ఓ కీలక పాత్ర చేశారు. షాజీ కైలాస్ డైరెక్షన్‌లో చేసిన 'ఎలోన్' మూవీ త్వరలో రిలీజ్ కానున్నది. అలాగే 'లూసిఫర్' సీక్వెల్ 'ఎల్2', 'దృశ్యం' ఫేమ్ జీతు జోసెఫ్‌తో 'రామ్' సినిమాలు కూడా మోహన్‌లాల్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



