బర్త్‌డే న్యూస్: నాగార్జున 'వైల్డ్ డాగ్' సెకండ్ లుక్ వచ్చింది
on Aug 29, 2020

అక్కినేని నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తోన్న 6వ చిత్రం 'వైల్డ్ డాగ్'. అహిషోర్ సోల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్ షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉంది. ఇప్పటి వరకూ 70 శాతం సన్నివేశాలు చిత్రీకరించారు.
ఆగస్ట్ 29 నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం శనివారం చాలా వైవిధ్యభరితమైన, ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ద్వారా విజయ్ వర్మ అనే ఎన్ఐఏ ఆఫీసర్ రోల్‌ను నాగార్జున చేస్తున్నారనే ఆసక్తికరమైన విషయం వెల్లడైంది.
అలాగే 'వైల్డ్ డాగ్' బృందంలో సభ్యులైన అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెషల్ ఏజెంట్ - రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), హష్వంత్ మనోహర్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ) లను కూడా ఈ పోస్టర్ పరిచయం చేసింది.

నేరస్తులతో వ్యవహరించే అత్యంత కఠినమైన తీరుతో ఏసీపీ విజయ్ వర్మను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. వాస్తవ ఘటనల ఆధారంగా అల్లిన కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ చేయని ఒక భిన్నమైన పాత్రను నాగార్జున చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించే ఒక ఆపరేషన్‌లో ప్రత్యర్థులకు కనిపంచకుండా దాగి, గన్‌తో వారి అంతుచూడ్డానికి సిద్ధంగా ఉన్న ఏసీపీ విజయ్ వర్మ లుక్‌లో నాగార్జున ఇంప్రెసివ్‌గా కనిపిస్తుండగా, పోస్టర్ డిజైన్ ఆకట్టుకుంటోంది.
దియా మీర్జా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సయామీ ఖేర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



