అనుష్కకు అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్న చిన్మయి! ఎందుకంటే?
on Aug 29, 2020

విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మకు కొడుకు పుట్టాలని సింగర్ చిన్మయి కోరుకుంటున్నారు. లేదంటే ఒక పది, పదమూడు ఏళ్ల తర్వాత పుట్టిన అమ్మాయి షార్ట్స్ గాని స్లీవ్ లెస్ డ్రెస్సులు గాని వేసుకుంటే కచ్చితంగా మీమ్ పేజీల్లో వల్గర్ కామెంట్స్ పెడతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అనుష్కకు పుట్టబోయే బిడ్డ గురించి చిన్మయి ఎందుకు స్పందించారు అంటే?
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ అ దంపతులు జనవరిలో తమకు బిడ్డ పుట్టబోతున్నాడని ప్రకటించగానే కొన్ని మీమ్ పేజీలు అబ్బాయి పుడతాడు అన్నట్టుగా రాసుకొచ్చారు. విరాట్ కొడుకుని కింగ్ అని అభివర్ణించారు. అటువంటి ఒక మీమ్ పేజీ కింద 'కింగ్ అంటున్నాడు క్వీన్ అనొచ్చు కదా' అని చిన్మయి అంటున్నట్లు ఎవరో ఫోటో పెట్టి కామెంట్ చేశారు. అందువల్ల చిన్మయి స్పందించారు.
"అమ్మాయిలు స్లీవ్స్ వేసుకుంటే భారత స్త్రీలు దుప్పట్టా మర్చిపోయారు అని కామెంట్ పెడతారు. ఇలా డ్రెస్ చేసుకుంటే మేము ఎలాగైనా కామెంట్ పెడతాము అంటారు. అందుకని అనుష్కకు అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నా. కానీ, మీమ్ పేజీ అడ్మిన్ ఫ్యామిలీ లో మాత్రం అమ్మాయిలే పుట్టాలని కోరుకుంటున్నాను. అప్పుడు వాళ్లు 'అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి' అని అమ్మాయికి క్లాస్ పీకుతున్నప్పుడు మనం వెళ్లి 'అందరూ అబ్బాయిలు కాదు' అని చెప్పవచ్చు" అని చిన్మయి ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



