నాగ్, కాజల్ చిత్రం.. కథ అదేనా?
on May 14, 2021
కింగ్ నాగార్జున, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తొలిసారిగా ఓ సినిమాలో కలిసి నటించనున్న సంగతి తెలిసిందే. `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు రూపొందించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని..
నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాజీ `రా` ఏజెంట్ గా నాగ్.. `రా` ఏజెంట్ గా కాజల్ దర్శనమివ్వనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి గుల్
పనాగ్ కథానాయకుడి చెల్లెలి పాత్రలో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఉద్యోగం మానేసిన తరువాత లండన్ లో ప్రైవేట్ జీవితం గడిపే నాగ్ కి.. 20 సంవత్సరాల తరువాత
తన చెల్లెలు నుంచి ఫోన్ వస్తుంది. ఇంతకీ ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటి? భారత్ లో ఉన్న తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం కథానాయకుడు ఏం చేశాడు? అనే పాయింట్ తో ఈ క్రేజీ వెంచర్
తెరకెక్కనుందట. కాగా, ఈ సినిమా కోసం నాగ్.. మార్షల్ ఆర్ట్స్, కత్తి పోరాటాలు, ఇతర యుద్ధ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. మరి.. `వైల్డ్ డాగ్` తరువాత రానున్న ఈ చిత్రంతో
నాగార్జున ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.