మనకు బాగా తెలిసిన హీరోయిన్ల ఆస్తులెంతో తెలుసా?
on Aug 27, 2020

అనేక రంగాలలో మాదిరిగానే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీ అనేది తెలిసిందే. మేల్ స్టార్స్ పారితోషికాలు ఒక రకంగా, ఫిమేల్ స్టార్స్ పారితోషికాలు ఇంకో రకంగా ఉంటాయి. అయినప్పటికీ కొంతమంది హీరోయిన్లు సుదీర్ఘ కాలం రాణిస్తుండటం ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తులు సంపాదించగా, కొంతమంది హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఆస్తులు వెనకేసుకుంటూ వస్తున్నారు. మనకు బాగా తెలిసిన కొంతమంది తారలె ఎంత రిచ్ అనేది తెలిసింది. రిపబ్లిక్ టీవీ ప్రకారం ఇవి రమారమి లెక్కలు. ఆ తారలెవరు, వాళ్ల ఆస్తుల విలువేమిటో ఓ లుక్కేద్దాం...
కరీనా కపూర్ - రూ. 450 కోట్లు
బాలీవుడ్ హీరోయిన్లలో 39 సంవత్సరాల కరీనా కపూర్ రేంజే వేరు. సినిమాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో ఆమె ఆస్తుల విలువ రూ. 450 కోట్లకు చేరుకుంది.
అనుష్క శర్మ - రూ. 227 కోట్లు
పదమూడేళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనుష్క శర్మ.. టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. సొంత నిర్మాణ సంస్థ కూడా ఉన్న ఆమె సంపాదన విలువ రూ. 227 కోట్లని అంచనా.
దీపికా పడుకోనే - రూ. 102 కోట్లు
పద్నాలుగేళ్ల క్రితం 'ఓం శాంతి ఓం' మూవీలో షారుఖ్ ఖాన్ జోడీగా నటించడం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 34 ఏళ్ల దీపికా పడుకోనే ఇవాళ నంబర్ వన్ హీరోయిన్. ఆమె ఆస్తుల నికర విలువ రూ. 102 కోట్లు.
అలియా భట్ - రూ. 72 కోట్లు
బాలీవుడ్‌లో అత్యంత గిరాకీ ఉన్న తారల్లో ఒకరైన అలియా భట్ టాలీవుడ్‌కు 'ఆర్ఆర్ఆర్' మూవీతో పరిచయం కాబోతోంది. నెపోటిజం విమర్శల్ని బలంగా ఎదుర్కొంటున్న ఈ అమ్మడి ఆస్తుల విలువ రూ. 72 కోట్లు.
తాప్సీ పన్ను - రూ. 43 కోట్లు
కొంత కాలం టాలీవుడ్‌లో పనిచేసి, తర్వాత బాలీవుడ్‌లో దాదాపుగా సెటిల్ అయిపోయిన తాప్సీ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి మార్కెట్ తెచ్చుకుంది. నికరంగా ఆమె దగ్గర రూ. 43 కోట్ల ఆస్తులున్నాయి.
భూమి పెడ్నేకర్ - రూ. 7 కోట్లు
అక్షయ్ కుమార్ భార్యగా 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన భూమి పెడ్నేకర్.. అదివరకు యష్ రాజ్ ఫిలిమ్స్‌లో క్యాస్టింగ్ ఏజెంట్‌గా పనిచేసింది. ఎనిమిది సినిమాల తర్వాత ఆమె దగ్గర రూ. 7 కోట్లున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



