నీహారికది మహానటి సావిత్రి రేంజ్..!
on May 19, 2016

కొణిదెల నీహారిక. మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ తో ఇండస్ట్రీలోకి వస్తున్న ఆ మెగాడాటర్, ఇప్పటి వరకూ టీవీ ప్రోగ్రామ్స్, యూట్యూబ్ సీరీస్ మాత్రమే చేసింది. తాజాగా ఒక మనసుతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో తొలి అడుగు వేస్తోంది. అయితే మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే, అందరూ ఆమెను మహానటి సావిత్రితో పోల్చడం విశేషం. సాధారణంగా వారసులు హీరోగా వస్తున్నప్పుడు ఉండే బజాయింపే, నిన్న కూడా కనబడింది. సినిమా డైరెక్టర్ రామరాజు, హీరో నాగశౌర్యలు ఇద్దరూ కూడా నీహారిక మహానటి సావిత్రి రేంజ్ అంటూ తెగ పొగిడేశారు. సినిమాల్లో ఇంకా తొలి అడుగులు వేస్తున్న నీహారికను సావిత్రి గారితో పోల్చడం, కాస్త ఓవరే. నాగశౌర్య అయితే ఒకడుగు ముందుకేసి, తనకు సావిత్రి, సౌందర్య, అనుష్క ఇష్టమని, వాళ్ల తర్వాత నటనలో ఆ స్థాయి నీహారికది అంటూ ఆమెను ఆకాశానికెత్తేశాడు. సినిమా రిలీజైన తర్వాత జనాలు కూడా అలా ఫీలవుతున్నారు కదా అని ఆ పబ్లిసిటీ ఇస్తే ఫర్లేదేమో గానీ, అప్పుడే ఒక మహానటితో నీహారికను పోల్చడం కాస్త హెవీ అయిందంటున్నారు సినీజనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



