కంగనా రనౌత్ యాక్షన్ ట్రయినింగ్ షురూ!
on Oct 16, 2020

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి నాయిక జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ 'తలైవి' హైదరాబాద్ షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. హైదరాబాద్ నుండి వెళ్లిన కంగనా రనౌత్ కొత్త సినిమాల కోసం యాక్షన్ ట్రయినింగ్ తీసుకోవడం షురూ చేశారు.
ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందనున్న 'తేజస్'లో యుద్ధ విమానం నడిపే ఫైలెట్ గా కంగనా రనౌత్ కనిపించనున్నారు. మరో సినిమా 'ధకాడ్'లో ఆమెది గూఢచారి పాత్ర. ఈ రెండు సినిమాల కోసం యాక్షన్ ట్రయినింగ్ తీసుకుంటున్నారు. మనాలీలోని తన ఇంటి టెర్రస్ మీద ట్రయినింగ్ తీసుకుంటున్న వీడియో ట్వీట్ చేశారు.
ఓ వైపు సినిమా షూటింగులు చేస్తూ... మరోవైపు సుశాంత్ మరణం, బాలీవుడ్ పెద్దల తీరుపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ కంగనా రనౌత్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



